Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఔత్సాహికులకు కొత్త అవకాశాలను సృష్టించే క్రమంలో టీ-హబ్ పలు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నది. ఈ క్రమంలో బీమాసేవల రంగంలో పేరుగాంచిన స్విస్ రే గ్లోబల్ బిజినెస్ సొల్యూషన్స్ (జీబీఎస్)తో బుధవారం అవగాహనకు వచ్చింది. ఈ సందర్భంగా టీ-హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాసరావు, జీబీఎస్ ఇండియా హెడ్ అమిత కర్లా మాట్లాడుతూ, తాజా ఒప్పందంతో ఈ రంగంలో అంకుర సంస్థల ప్రవేశానికి మార్గం ఏర్పడిందని తెలిపారు.