Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంటులో ఎంపీలపై వేటు ఆక్షేపణీయం
- బీజేపీది నియంతృత్వం.. నిరంకుశ పాలన
- పాడి ఉత్పత్తులపై జీఎస్టీ దారుణం
- రాష్ట్రంపై కేంద్రానిది వివక్షాపూరిత వైఖరి
- కౌన్సిల్లో నర్సిరెడ్డి, జీవన్‌రెడ్డికి సమయమిస్తున్నా : విలేకర్లతో ఇష్టాగోష్టిలో శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తనకు నచ్చని పార్టీలను, ప్రశ్నించే ఎంపీలను పార్లమెంటు నుంచి గెంటేయటం అధికార బీజేపీకి ఆనవాయితీగా మారిందని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ పార్టీది పచ్చి నియంతృత్వం.. నిరంకుశ పాలనంటూ విమర్శి ంచారు. రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి వరకూ తెలంగాణపై కేంద్రం వివక్షా పూరితంగా వ్యవహరి స్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని శాసనమండలి (చైర్మెన్ కార్యాల యం)లో ఆయన విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లా డారు. వివిధ అంశాల్లో రాష్ట్రం పట్ల కేంద్రం అను సరిసున్న వైఖరి, పార్లమెంటులో వాడకూడని పదాలంటూ కేంద్రం ఇటీవల విడుదల చేసిన జాబితా, రాష్ట్ర ప్రభుత్వంపైనా.. సీఎం కేసీఆర్‌పైనా గవర్నర్ తమిళిసై ఇటీవల చేసిన వ్యాఖ్యలు, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్ర మాలు, కొత్త మండలాలు, పోలవరం ముంపు సమస్య తదితరాంశాలపై ఆయన ముచ్చటించారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాలరెడ్డి రాజీనామా చేస్తారంటూ వస్తున్న వార్తలపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. చట్టసభల్లో ప్రస్తు తం కొనసాగుతున్న చర్చలు, వాటి తీరు, రాజకీయా ల్లో వచ్చిన మార్పులపై చైర్మెన్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. శాసన మండలిలో సబ్జెక్టు పరంగా మాట్లాడే ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి తదితరులకు సమయం బాగానే ఇస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వివరించారు.
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయకుండా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఈ సందర్భంగా గుత్తా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ చట్టాన్ని అమలు చేయడం బీజేపీ సర్కారుకు ఇష్టం లేదన్నారు. ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినప్ప టికీ వాటిపై నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. మోడీ సర్కారు ప్రజాస్వామ్య విలువలను దిగజారు స్తున్నదని చెప్పారు. విభజన చట్టాన్ని పక్కనపెట్టి నాటి ఏపీ సీఎం చంద్రబాబును అడ్డంపెట్టుకుని తెలంగాణకు సంబంధించిన ఐదు మండలాలను ఏపీలో కలిపేసిందని విమర్శించారు. ప్రాజెక్టుల కింది ప్రాంతాలు ముంపునకు గురవుతాయనుకుంటే కచ్చితంగా వాటి ఎత్తును కుదించాల్సిందేనని అన్నారు. గతంలో ఎస్ఆర్ఎస్పీ, జూరాల ప్రాజెక్టుల ఎత్తును కుదించారని గుర్తు చేశారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్టు ఎత్తును కుదించడంలో తప్పేమీ లేదన్నారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. మోడీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ పరుష పదజాలం ఉపయోగించారనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ...ఎదుటివారి స్పందనను బట్టే మన స్పందన ఉంటుందని చెప్పారు. అన్ పార్లమెంటరీ పదాలకు సంబంధించి ఇటీవల కేంద్రం రూపొందించిన జాబితాలను ముందుగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుందనీ, కాంగ్రెస్, బీజేపీ ఏ స్థానంలో ఉంటాయో తేల్చుకోవాలంటూ సూచించారు. నిత్యా వసరాలు, ముఖ్యంగా పాడి ఉత్పత్తులపై జీఎస్టీ విధించటం దారుణమని అన్నారు. ఎనిమిదేండ్లలో బీజేపీ గొప్పగా చేసిందేమైనా ఉందంటే... అది ధరలు పెంచడం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుకు అప్పగించటమేనని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో వ్యవసాయ భూములు లేఔట్లుగా మారిపోతున్నాయని చెప్పారు. దీంతో పాల ఉత్పత్తి బాగా తగ్గిపోయిందనీ, ఈ క్రమంలో ప్రయివేటు పాల కంపెనీలు వినియోగదా రులను దోచుకుంటున్నాయని చెప్పారు. సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలు ఏం కోరుతున్నారో అది చేయక తప్పదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇందుకు విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం మాత్రం అదానీ ఆస్తులను పెంచిందని విమర్శించా రు. వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకే రాష్ట్రంలో రైతు బంధు పథకాన్ని అందరికీ అమలు చేస్తున్నా మని తెలిపారు. రాజన్న రాజ్యాన్ని ముందు ఆంధ్రప్రదేశ్‌లో తీసుకరావాలంటూ పరోక్షంగా వైఎస్ షర్మిలకు సూచించారు. రామోజీ ఫిల్మిం సిటీని వెయ్యి నాగళ్లతో దున్నుతానంటూ గతంలో వ్యాఖ్యానించిన కేసీఆర్...అధికారంలోకి వచ్చాక దానిపై స్పందించ లేదన్న ప్రశ్నకు...'అక్రమ భూముల్ని ఉద్దేశించి అప్పట్లో ఆయన అలా మాట్లాడారు. ఇప్పుడవి సక్రమంగా మారాయి...' అంటూ చలోక్తులు విసిరారు. రాజ్యాంగబద్ధంగా గవర్నర్ పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరైందికాదని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఏ పదవిలో ఉన్నా దాని స్థాయి, హోదా తగ్గకుండా చూడాలన్నా రు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం అడ్డుకోవడం వల్లే ఉద్యోగులకు వేతనాలు కొంత ఆలస్యమయ్యాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం అప్పులు చేసిందనీ, కేంద్ర మాత్రం ఏమీ చేయకుండానే రూ 100 లక్షల కోట్లు అప్పులు చేసిందంటూ విమర్శించారు. నిర్వాసితులకు కొన్ని సాంకేతిక కారణాలతోనే పరిహారం ఆలస్యమవు తుందని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. మును గోడు ఉప ఎన్నిక గురించి ప్రస్తావించగా... 'ఇప్పుడు నేను సుఖంగా ఉన్నా...ఈ కుర్చీలో కూర్చుని ఉప ఎన్నికల గురించి, రాజకీయాల గురించి మాట్లాడటం సరికాదు... దాని గురించి నన్నెవరూ సంప్రదిం చలేదు, మాట్లాడలేదు.. ఎన్నికలు వచ్చినప్పుడు ఆయా పరిస్థితులనుబట్టి పార్టీలు నిర్ణయాలు తీసుకుంటాయి...' అని గుత్తా సమాధానమిచ్చారు.