Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి వాన్‌పిక్ ప్రాజెక్టుల ప్రయివేటు లిమిటెడ్‌పై సీబీఐ పెట్టిన చార్జిషీట్‌ను హైకోర్టు కొట్టేసింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పారిశ్రామిక కారిడార్ కోసం 2008లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సర్కార్ వాన్‌పిక్ ప్రాజెక్ట్ ప్రయివేటు లిమిటెడ్‌కు 12 వేలఎకరాలను కేటాయించింది. ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ 2011 ఆగస్టులో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో వాన్‌పిక్‌పై హైదరాబాద్ సీబీఐ కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. దీన్ని వాన్‌పిక్ హైకోర్టులో సవాలు చేసింది. గతేడాది దాఖలు చేసిన కేసులో గురువారం హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పును వెలువరించారు. సీబీఐ కోర్టులోని కేసును కొట్టేసింది. వ్యక్తులు చేసిన తప్పులకు వాన్‌పిక్ కంపెనీపై కేసు చెల్లదంటూ తీర్పులో పేర్కొన్నారు.
అవి ప్రభుత్వ భూములే
శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని 84 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని పేర్కొంటూ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది. హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా తమకు అనుకూలంగా ఉన్నాయనీ, బోగస్ పత్రాలతో కొందరు వ్యక్తులు తమ భూమిగా హైకోర్టు నుంచి పొందిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది. ఈ మేరకు ప్రభుత్వం వేసిన స్పెషల్ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ జి.శ్రీదేవి, జస్టిస్ ఎంజీ ప్రియదర్శినిలతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. ఆర్కియాలజీ శాఖ ఇచ్చిన పత్రాలను చూస్తే అవి ప్రభుత్వ భూమేనని అర్ధమవుతుందని ప్రభుత్వం వాదించింది.విచారణ వచ్చే నెలకు వాయిదా పడింది.