Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ డివిజన్లోని కాచిగూడ, జడ్చర్ల, మహబూబ్‌నగర్, కర్నూల్ రైల్వేస్టేషన్లల్లో దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ విస్తృత తనిఖీలు చేపట్టారు. రైల్వే ట్రాక్ నిర్వహణ, భద్రతకు సంబంధించిన అంశాలను ఆయా స్టేషన్లలో పరిశీలించారు. తిమ్మాపూర్ మరియు బాలానగర్ రైల్వేస్టేషన్లలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం ఆయన తన బృందంతో కలిసి పలు రైల్వేస్టేషన్లలో తనిఖీలు నిర్వహించారు. కార్యక్రమంలో డివిజన్ మేనేజన్ శరత్ చంద్రయాన్, ఇతర ఉన్నతాధికారులతోపాటు వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది ఉన్నారు. జడ్చర్ల రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, గూడ్స్‌షెడ్లు, హమాలీల విశ్రాంతి గదిని పరిశీలించారు. మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్‌ను జనరల్ మేనేజర్ సమగ్రంగా పరిశీలించారు. స్థానిక కళాకారులను, వారి ఉత్పత్తులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 'వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్టు' స్టాల్‌ను సందర్శించారు. గద్వాల రైల్వే స్టేషన్లో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు.