Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు కాంగ్రెస్ నేతల ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో అధిక వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయనీ, ఈ సమయంలో కూడా రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సమావేశం నిర్వహించరా? అని కాంగ్రెస్ సీనియర్ నేతలు మర్రి శశిధర్రెడ్డి, ఎం. కోదండరెడ్డి సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. శుక్రవారం హైదరబాద్లోని గాంధీభవన్లో వారు విలేకర్లతో మాట్లాడారు. వరదలొచ్చినప్పుడు సహాయచర్యలు, పునరావాస కేంద్రాలు, తక్షణ సాయం తదితర అంశాలపై చర్చించేందుకు సీఎం అధ్యక్షతన జరగాల్సిన డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సమావేశం ఇప్పటి వరకు జరగలేదని విమర్శించారు. మరోవైపు టీఆర్ఎస్ నేతలు పంట నష్టంపై మాట్లాడకుండా రైతుబంధు గురించి మాత్రమే మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులకు జరిగిన నష్టంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.