Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సిద్దిపేట జిల్లా కొమురవెలి ్ల మండలం రాంసాగర్ గ్రామ దళిత సర్పంచ్ తాడూరి రవీందర్‌ను మండల సర్వసభ్య సమావేశం సందర్భంగా అవమానించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్‌వెస్లీ,టి స్కైలాబ్‌బాబు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు ఓట్లు వేసిన వారికి మాత్రమే దళిత బంధు ఇస్తామనీ, నువ్వు నోరు మూసుకుని కూర్చో అంటూ సర్పంచ్‌ను అవమానించిన ఎమ్మెల్యే పై ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రెండు నెల్ల కిందట స్థానిక ఎంపీపీ రాజకీయాల కతీతంగా అన్ని గ్రామాలకు దళిత బంధు అమలు చేద్దామంటూ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. దీనికి భిన్నంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అగ్రకుల అహంకారంతో నిండు సభలో కేసీఆర్‌కు ఓట్లు వేసిన వారికి మాత్రమే ఇస్తామంటూ అని నిస్సిగ్గుగా మాట్లాడడం శోచనీయమని తెలిపారు. ఎమ్మెల్యే అంటే కేవలం టీఆర్ఎస్ పార్టీకేనా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ కార్యకర్తలకెే దళిత బంధు అయితే రాష్ట్ర ఖజానా నుంచి ఆ పథకానికి నిధులు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.