Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నేతలకు కృష్ణ తేజ సూటి ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రజల ఆమోదంతో ఏర్పాటు చేసిన ప్రభుత్వాలను కూల్చడమే ప్రజాస్వామ్యమా? అని టీపీసీసీ అధికార ప్రతినిధి కృష్ణ తేజ బీజేపీ నేతలను ప్రశ్నించారు. ప్రభుత్వాలను పడగొట్టడాన్ని కూడా ఆ పార్టీ నేతలు ఏదో సాధించినట్టు గొప్పలు చెబుతున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికైన ప్రభుత్వాలను అసమ్మతి స్వరం పేరుతో కూల్చేయడం బీజేపీకి రివాజుగా మారిందని విమర్శించారు. 30 నుంచి 35 శాతం ఓటు బ్యాంకు కలిగి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలను కూడా కూలదోయడమే పనిగా పెట్టుకుందని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలను లేకుండా చేస్తున్నదని విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకుని నేతలను లొంగదీసుకుంటున్నదని విమర్శించారు. ఇటీవల బీజేపీ నేత మిథున్చక్రవర్తి మాట్లాడుతూ టీఎంసీకి చెందిన 38 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని చెప్పారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే ఈటలరాజేందరేమో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ మాట్లాడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు.