Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్షల్లో విద్యుత్ సంస్థలకు చెందిన ఐదుగురు ఉద్యోగులను మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డారనే కారణంతో సస్పెండ్ చేశామని టీఎస్ఎస్పీడీసీఎల్ ఎండీ రఘుమారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సంస్థ ఉద్యోగుల నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో పనిచేస్తున్న ఏడీఈ మొహమ్మద్ ఫిరోజ్‌ఖాన్, లైన్మెన్ సపావత్ శ్రీనివాస్‌్, విధులనుంచి సస్పెండ్ చేశామని పేర్కొన్నారు. వీరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. ప్రయివేటు మీటర్ రీడర్‌గా పనిచేస్తున్న కేతావత్ దస్రు, ఎ దశరథ్ను విధుల నుంచి తొలగించినట్టు తెలిపారు. ఉత్తర తెలంగాణ పంపిణీ సంస్థలో పనిచేస్తున్న షేక్ సాజస్ సబ్ ఇంజనీర్, తెలంగాణ ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న ఏడీఈ మంగళగిరి సైదులు విధుల నుంచి సస్పెండ్ చేసినట్టు పేర్కొన్నారు. భవిష్యత్తులో సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.