Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ వ్యాధితోనే ఎక్కువగా మరణాలు
- వరల్డ్ హెపటైటీస్ డేలో పలువురు వైద్యులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా, హెచ్ఐవీ కన్నా హెపటైటీస్ వ్యాధితోనే ఎక్కువ ప్రమాదమనీ, దాంతోనే ఎక్కువ మంది మరణిస్తున్నారని పలువురు వైద్యులు తెలిపారు. గ్లీన్ గెల్స్ గ్లోబ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో ప్రపంచ హెపటైటీస్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ ఇండియా సీఈవో అనురాగ్ యాదవ్, జీజీహెచ్ సీఈవో డాక్టర్ రియాజ్ ఖాన్, హెమటాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ చందన్ కుమార్ తదితరులు మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది 30 కోట్ల మందికి ఈ వ్యాధి సోకుతుందనీ, 14 లక్షల మంది మరణిస్తున్నారని తెలిపారు. ఈ వ్యాధి రావడానికి హెపటైటీస్ వైరస్‌తోపాటు మద్యం సేవించడం, ఫ్యాటీ లివర్ ప్రధాన కారణాలని వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హౌంశాఖ మంత్రి మహమూద్ అలీ, ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్, పలు ఇస్లామిక్ దేశాల కాన్సులేట్ జనరల్ ప్రతినిధులు గ్లోబల్ ఆస్పత్రి అందిస్తున్న సేవలను ప్రశంసించారు.