Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో సహకారం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో సహకారం పొందేందుకుగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయితీ రాజ్(ఎన్ఐఆర్డీపీఆర్), యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్(యూఓఆర్)తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నది. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి వర్గం దీనికి అమోదముద్ర వేసింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో అధ్యాపకులకు వారి జ్ఞానాన్ని సముపార్జించడంలో, విస్తృతపర్చడంలో, వ్యవసాయం, పోషణలో అంతర్జాతీయ వృత్తిపరమైన నెట్వర్క్ను అభివృద్ధి చేస్తున్నది. రెండు సంస్థలు కలిసి వ్యవసాయ ఆర్థిక శాస్త్రం, గ్రామీణాభివృద్ధి, జీవనోపాధి, పోషకాహార అధ్యయనాలలో గణనీయమైన పరిశోధన నైపుణ్యాన్ని తీసుకురానున్నది. స్త్రీ, శిశు అభివృద్ధి రంగంలోనూ పరిశోధన చేయనున్నారు.