Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిజాయితీ గల పోలీసుల ఆవేదన
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పోలీసు పరిస్థితి ''ముందు నుయ్యి వెనుక గొయ్యిలా'' తయారైంది. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించే కొందరు పోలీసు ఆఫీసర్లపై రకరకాల నిందలు పడుతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చివరికి రౌడీషీటర్లు సైతం వారి పనితీరుపై విశ్లేషణ చేస్తుండటాన్ని జనం జీర్ణించుకోలేక పోతున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరును ఒకే కోణంలోనే చూస్తున్నారని కొందరు పోలీసులు వాపోతున్నారు. ఖమ్మం నగరంలో అరాచకాలను నియంత్రించడంలో పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసలు అందుకున్నారు. జిల్లాను గంజాయి స్మగ్లింగ్ నియంత్రణలో ముందంజ లో నిలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీషీటర్లపై చర్యలు తీసుకునే క్రమంలో... సోషల్ మీడియా వేదికగా వారు ఎదురుదాడికి దిగుతున్న ఉదంతాలను చూస్తున్నాం. ఇంకా పలు కేసుల విషయంలో పోలీసుల తెగువ ప్రశంసలు అందుకుంటున్నా... వదంతుల ముందు అవి నిలువలేక పోతున్నాయని కొందరి వాదన. ఇటీవల ఓ రౌడీషీటర్ వీడియో విడుదల చేసి పోలీసులపై తీవ్ర ఆరోప ణలు చేశారు. అది సోషల్ మీడియాలో ప్రసారమైంది. అందులో వాస్తవా లు గ్రహించకుండా వాటినే నమ్మి పోలీసులను కొంతమంది తప్పుగా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసమని వాపోతున్నారు. పోలీసుల కు, మంత్రులు అండదండలు ఉన్నాయని చెప్పడం సరికాదం టున్నారు. ఎవరు అధికారంలో ఉన్నా ప్రభుత్వం చెప్పినట్టు చేయక తప్పదని, అలా అని తప్పు చేసిన వారిని వదిలేయలేమని అభిప్రాయ పడ్డారు. విధి నిర్వ హణలో భాగంగా ప్రజా సేవకులుగా వ్యవహరించే తమకు తరతమ భేదాలు ఉండవని పోలీసువర్గాల మాట. నేరాలను అదుపుచేసే సమయంలో, రౌడీ షీటర్ల విషయంలో ఎలాంటి చర్యలనైనా తీసుకునేం దుకు వెనుకాడబోమని ఖమ్మంలోని ఓ పోలీసు అధికారి తెలిపారు.