Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పంట నష్టంపై యుద్ధ ప్రాతిపదికన సర్వే చేసి, తక్షణం నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలోని దాదాపు 11 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయాయని తెలిపారు. ఏ మండలంలో ఎన్ని ఎకరాల్లో పంటలలకు నష్టం జరిగిందనే విషయమై పూర్తి స్థాయిలో సర్వే చేయాలని డిమాండ్ చేశారు.య పత్తి , వరి, సోయా, కూరగాయలు, పండ్ల తోటలు దారుణంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని కోరారు.