Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంపుసెట్ల మునకకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి:
సీపీఐ(ఎం) డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించామంటూ ప్రకటించిన కాళేశ్వరం ప్రాజెక్టులో పంపుసెట్ల మునకతో మేఘా కన్స్ట్రక్షన్ లోపాలు, ప్రభుత్వ అవినీతి బట్టబయలైందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఇటీవల కురిసిన వర్షాలకు కాళేశ్వరం పంపుల రక్షణ గోడ కూలి 17 పంపులు నీటిలో మునిగి పోయాయని తెలిపింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మునకను సమర్ధించు కుంటూ చీఫ్ ఇంజినీర్లు ఇదంతా పెద్ద ప్రమాదం కాదనీ, సహజంగా జరిగే ప్రక్రియేనని ప్రకటించారనీ, ఇంతకన్నా సిగ్గుమాలిన వ్యాఖ్య ఇంకోటి లేదని విమర్శించారు. పంపుసెట్ల మునకపై విచారణ జరిపి బాధ్యులైన మెగా కంపె నీ, ప్రభుత్వ ఇంజినీర్లపై చర్యలు తీసుకోవాలనీ, ఈ నష్టాన్ని వారినుంచే వసూ లు చేయాలని డిమాండ్ చేశారు. కానీ వారిపై చర్యలు తీసుకోవడానికి బదులు ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతున్నదని విమర్శించారు. రూ.25 కోట్లతో పంపులను బాగుచేయొచ్చంటూ, ఇంజినీర్లు చెబుతున్నది అవాస్తవమని తెలిపా రు. మరమ్మతులకు కనీసం ఆర్నెల్ల కాలం పడుతుందనీ, రూ.300 కోట్లు ఖర్చ వుతుందంటూ రిటైర్డు ఇంజినీర్లు చెప్తున్నారని పేర్కొన్నారు. ఏది వాస్తవమో ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. కానీ ప్రభుత్వం దోబూచులాడుతూ ఎలాం టి ప్రకటన చేయకుండా జాప్యం చేస్తున్నదని వివరించారు. గతంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి చెందిన ఐదు పంపులు 2000 సంవత్సరంలో వచ్చిన వరదలకు నీటిలో మునిగిపోయాయని గుర్తు చేశారు. ఈ రోజుకు వాటిలో రెండు పంపులను మాత్రమే బాగుచేయగల్గారని తెలిపారు. రెండు పంపులతో లక్ష్యంలో నిర్ణయించిన దానిలో సగం నీరు మాత్రమే పంపింగ్ చేయగలుగు తున్నారని పేర్కొన్నారు. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్నపుడు కాళేశ్వరం ప్రాజెక్టు పంపులను బాగుచేయడానికి ఎంతకాలం పడుతుందో చెప్పలేమని వివరించారు. పంపులు మునిగి పది రోజులు దాటినా ఇంతవరకు మునిగిన నీరును తోడలేదని తెలిపారు. వాటితోపాటు బాహుబలి పంపులను బయటకు తీసి రిపేర్లు చేయడం సాంకేతికంగా సమస్యలతో కూడుకున్నదని పేర్కొన్నారు. గోదావరి నీటిలో ఒండ్రు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. పంపులోని రాగి తీగకు ఒండ్రు పట్టడం వల్ల బాగు చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన పని అని వివరించారు. మొత్తం 17 పంపులను బాగు చేస్తే తప్ప ప్రభుత్వ సాగు నీటి లక్ష్యం నెరవేరదని సూచించారు. ఈ సమస్యను పక్కదారి పట్టించడానికే సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ అని వాఖ్యానించడం హాస్యాస్పదమని విమ ర్శించా రు. ప్రభుత్వం తక్షణమే పంపుల మునకపై, స్పష్టమైన ప్రకటన చేయాలనీ, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని తమ్మినేని డిమాండ్ చేశారు.