Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సందర్శకులు రావద్దని జలమండలి ఎండీ సూచన
నవతెలంగాణ-సిటీబ్యూరో
వర్షాల నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని జంట జలాశయాలకు వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఉస్మాన్‌సాగర్(గండిపేట), హిమాయత్‌సాగర్ నిండుకుండల్లా మారాయి. ఇన్‌ఫ్లో భారీగా ఉండటంతో రెండు జలాశయాల గేట్లు ఎత్తి నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. ఉస్మాన్ సాగర్ 2 గేట్లు, హిమాయత్ సాగర్ ఒక గేటు ఎత్తేశారు. ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్ ఇన్‌ఫ్లో 600 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 776 క్యూసెక్కులు ఉంది. హిమాయత్ సాగర్ ఇన్‌ఫ్లో 400 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 330 క్యూసెక్కులు ఉంది. జంట జలాశయాల్లో వరదనీరు చేరుతుండటంతో అప్రమత్తమైన జలమండలి అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సందర్శకులు రావద్దని ఎండీ దానకిషోర్ సూచించారు.