Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 55,662 మంది విద్యార్థుల హాజరు
- 204 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల పదో తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. 55,662 మంది విద్యార్థులు హాజరవుతారని వివరించారు. నిర్వహణ కోసం 204 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 204 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 204 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 2010 మంది ఇన్విజిలేటర్లను నియమించామని తెలిపారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం కోసం 42 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్లను నియమించామని వివరించారు. విద్యార్థుల హాల్‌టికెట్లు షషష.bరవ.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని సూచించారు. పరీక్షకు రెండు రోజుల ముందు రూ.50 ఆలస్య రుసుంతో ఫీజు చెల్లించి ఆయా పాఠశాల హెడ్మాస్టర్ వద్ద హాల్‌టికెట్లు పొందాలని కోరారు. పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. మొబైల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గడియారాల తీసుకురావడం నిషేధమని తెలిపారు. ఏమైనా ఇబ్బందులుంటే హెల్ప్‌డెస్క్ 040-23230942 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.