Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ నగరాన్ని అందరూ ప్రేమిస్తారు: మంత్రి హరీశ్‌రావు
- టైమ్స్ హోం హంట్ ఎక్స్పో ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విశ్వనగరంగా హైదరాబాద్ రూపుదిద్దుకుంటోందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి హరీశ్ రావు అన్నారు. అనేక రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందనీ, అంతేకాకుండా దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఉందని చెప్పారు. టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని హెటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటైన 'టైమ్స్ హోం హంట్ ఎక్స్పో'ను ఆయన ప్రారంభించారు. ఆదివారం వరకు ఇది కొనసాగనుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్-19 వల్ల అన్ని రంగాలూ దెబ్బతిన్నాయని చెప్పారు. అదే రీతిలో రియల్ ఎస్టేట్ రంగంపైనా ప్రభావం పడిందన్నారు. అయినా ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఆశాజనకంగా ఉన్నాయనీ, మళ్లీ అన్ని రంగాలూ ముందుకు వెళ్తున్నాయని వివరించారు. రాష్ట్రంలోనూ రియల్ ఎస్టేట్ రంగం వేగంగా పుంజుకుంటోందని అన్నారు. అన్ని రంగాల్లో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ నిలుస్తున్నదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి ఓ బ్రాండ్ ఇమేజ్ను తెచ్చారన్నారు. దేశంలో అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా హైదరాబాద్ పేరుగాంచిందని అన్నారు.