Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్‌డీకి టీఎస్ఆర్టీసీ జేఏసీ వినతి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల్లో రెగ్యులేషన్స్‌కు విరుద్ధంగా టెక్నికల్ అభ్యర్థులను నియమించడం సరికాదని టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ తెలిపింది. ఈ మేరకు జేఏసీ చైర్మెన్ కే రాజిరెడ్డి శనివారం బస్‌భవన్‌లోని మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల్లో డీఆర్, పీఆర్ కోటాల్లో నియామకాలు చేపట్టాలని సంస్థ రెగ్యులేషన్స్‌లో ఉన్నదనీ, డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుకు నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ అర్హతగా ఉన్నదని వివరించారు. కానీ ఆర్టీసీ యాజ మాన్యం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్, డిప్లొమా అర్హతతో ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకు ఆన్లైన్లో జూన్ 15వ తేదీ చివరి తేదీగా నిర్ణయిస్తూ ప్రకటన ఇచ్చిందని తెలిపారు. ఈ పోస్టులు కూడా రెగ్యులర్ నియామకాలుగా కాకుండా, మూడేండ్ల కాలవ్యవధితో దరఖాస్తులు కోరడం దురదృష్టకరమన్నారు. సంస్థ రెగ్యులేషన్స్‌కు వ్యతిరేకంగా, వాటిని దుర్వినియోగం చేయడం సరికాదంటూ ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు.