Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటితో ముగియనున్న పరీక్షలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం రాతపరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆదివారం వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ మేరకు ఎంసెట్ కన్వీనర్ ఎ గోవర్ధన్ ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం 46.471 మందికి కేటాయించగా, వారిలో 39,251 (84.5 శాతం) మంది పరీక్షలు రాశారని తెలిపారు. ఉదయం తొలివిడతకు 23,319 మందికి కేటాయిస్తే, వారిలో 19,700 (84.5 శాతం) మంది హాజరయ్యారని వివరించారు. మధ్యాహ్నం రెండోవిడతకు 23,152 మందికి కేటాయించగా, 19,551 (84.5 శాతం) మంది పరీక్ష రాశారని పేర్కొన్నారు. ఈ పరీక్షలను ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహ్మారెడ్డి, ఎంసెట్ కోకన్వీనర్ ఎం చంద్రమోహన్, కోఆర్డినేటర్ పి శ్వేత పర్యవేక్షించారని వివరించారు. ఆదివారం సైతం ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపారు.
ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రాథమిక కీ విడుదల
ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం ప్రాథమిక కీని విడుదల చేసినట్టు కన్వీనర్ ఎ గోవర్ధన్ పేర్కొన్నారు. ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్లో రాతపరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రాథమిక కీని https://eamcet.tsche.ac.in వెబ్సైట్లో పొందుపరిచామని వివరించారు. వచ్చేనెల ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపారు. ఎంసెట్ వెబ్సైట్ ద్వారా అభ్యంతరాలను సమర్పించాలని సూచించారు.