Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు చాడ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ)కు పేస్కేల్‌ను వర్తింపచేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శనివారం ఆయన లేఖ రాశారు. అనేక ఏండ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు చాలీచాలని వేతనాలతో ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారని తెలిపారు. వారి సమస్యలను పరిష్కరిస్తామనీ, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పేస్కేల్ వర్తింప చేస్తామనీ, వయస్సుపైబడిన వారి కుటుంబ సభ్యులకు వారసత్వ ఉద్యోగాలిస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ నేటికి రెండేండ్లు గడుస్తున్నా వారి సమస్యలు పరిష్కరించకపోవడంతో నిరుత్సాహం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అతి తక్కువ వేతనాలతో కుటుంబాలను పోషించలేక వీధినపడ్డారనీ, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారని వివరించారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కండ్లు తెరవకపోవడం దుర్మార్గమని విమర్శించారు. వారిని ఉపయోగించుకుని రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. ధరణిలో చోటుచేసుకొన్న తప్పులను సరిచేయడానికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వీఆర్ఏల అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం వారికి పేస్కేల్ వర్తింపచేయాలనీ, పదోన్నతులు, వారసత్వ ఉద్యోగాలివ్వాలనీ, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.