Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రక్షణ చర్యల్లేకుండా పాలమూరు రంగారెడ్డి లిప్ట్పనులు : వైఎస్ షర్మిల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కనీస రక్షణ చర్యలు పాటించకుండా పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ పనుల్లో ఐదుగురి ప్రాణాలను అక్కడి కంపెనీ బలిగొన్నదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు షర్మిల శనివారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చావులకు బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ఐదుగురు ప్రాణాలకు కారణం కావటమేగాక, జనం సొమ్మును దోచుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.నాసిరకం పనులు చేస్తూ..ఆడ్డగోలుగా లంచాలు ఎరవేస్తున్నారని ఆరోపించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మేఘా కంపెనీ కాంట్రాక్టులను రద్దు చేసి సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.