Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెవెన్యూ శాఖ ఉద్యోగులతో పెట్టుకుంటే అంతే : వీఆర్వో జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రానికే గుండెకాయ లాంటి సీసీఎల్ఏ కార్యా లయం నేడు ఓ పోస్టాఫీస్లా మారిందని వీఆర్వో జేఏసీ విమర్శించింది. కొందరు అధికారులు తప్పుడు సమాచారంతో సీఎం కేసీఆర్ను పక్కదోవ పట్టిస్తు న్నారని ఆరోపించింది. క్షేత్రస్థాయి రెవెన్యూ ఉద్యో గుల సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించింది. ఈమేరకు శనివారం వీఆర్వో జేఏసీ చైర్మెన్ గోల్కొండ సతీశ్, అడిషనల్ సెక్రటరీ జనరల్ పల్లెపాటి నరేశ్, కో-చైర్మెన్ జె.రవినాయక్, వైస్ చైర్మెన్ మౌలానా, నూకల శకంర్, రవీందర్, వెంకన్న, మురళి, ప్రతిభ, ఆర్గనైజింగ్ కార్యదర్శి కృష్ణగౌడ్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. వీఆర్వోలను ఇతర శాఖ ల్లోకి పంపిస్తామన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. వీఆర్వోలను రెవెన్యూ శాఖలోనే సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తమ డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న వీఆర్వోలు, వీఆర్లతో రెవెన్యూలో పాలన కుంటుం పడిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నాన్చేకొద్దీ సమస్య మరింత జఠిలం అవుతుందని తెలిపారు. రెవెన్యూ శాఖను రక్షించే నాయకులు లేరా? అని ప్రశ్నించారు. రెవెన్యూశాఖతో పెట్టుకున్నోళ్ల పరిస్థితి ఏమైందో చరిత్రే చెబుతున్నదని పేర్కొన్నారు.