Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3.48 లక్షల మంది హాజరు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అవి వచ్చేనెల పదో తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను ఇంటర్ బోర్డు అధికారులు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,48,171 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం 835 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లను నియమించారు. ప్రతి రోజు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలుంటాయి. నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అందుకే పరీక్షలకు గంట ముందే పరీక్షా కేంద్రాలకు రావాలంటూ విద్యార్థులకు సూచించారు. ఆలస్యం కాకుండా ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్ ధరించాలని సూచించారు.