Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ఖమ్మం
ప్రముఖ విద్యావేత్త సూరపనేని శేషు కుమార్(65) శనివారం మధ్యాహ్నం 2 గంటలకు గుండెపోటుతో మరణించారు. శేషుకుమార్ 1989-90లలో బల్లేపల్లిలో నిర్మల స్కూల్‌ను స్థాపించారు. ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్య సంఘాల రాష్ట్ర కార్యదర్శిగా, ట్రస్మా రాష్ట్ర అధికార ప్రతినిధిగా గత పాతిక సంవత్సరాలుగా ఉన్నారు. ఖమ్మంలో విద్యాసంస్థల అభివృద్ధికి కృషి చేశారు. విద్యారంగ సమస్యలపై పలు ఉద్యమాలు నిర్వహించారు. శేషుకుమార్ సతీమణి నిర్మల, కూతురు జోతిర్మయి, కొడుకు యోగిరాం. కొడుకు ఆస్ట్రేలియాలో ఉన్నారు. శేషు కుమార్ మృతికి రాష్ట్ర మంత్రి పువ్వాడ అజరు కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, జెడ్పీ చైర్మెన్ లింగాల కమల్ రాజు, తెలంగాణా సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్ సంతాపాన్ని తెలిపారు. సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పొతినేని సుదర్శనరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రా శ్రీకాంత్, కల్యాణం వెంకటేశ్వరరావు, సిపిఐ నేతలు హేమంతరావు, పోటు ప్రసాద్, ఎంఎల్ పార్టీ నుండి అశోక్ నివాళులర్పించారు. శేషుకుమార్ అంత్యక్రియలు సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రజల సందర్శనార్ధం భౌతిక కాయాన్ని ఉదయం 7 గంటలనుండి నిర్మల్ స్కూల్ ఆవరణలో (బల్లేపల్లి) ఉంచుతారు. సోమవారం ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాయి.