Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - దహెగాం
పంటలు పండించడానికి రైతులు ఆరుగాలం శ్రమిస్తుంటారు. తీరా పంట చేతికొచ్చే దాకా లాభమో నష్టమో కూడా తెలియదు. కానీ ఈ ఏడాది మాత్రం విత్తనాలు మొల కెత్తగానే రైతు కంట కన్నీటి రూపంలో వరదలకు పంటలు తుడిచి పెట్టుకు పోయాయి. మళ్లీ విత్తనాలు పెట్టడానికి పంట చేన్లలో ఎద్దుల అరక నడవలేని స్థితిలో ఒండ్రు మట్టితో నిండిపోయింది. దీంతో ఎలాగైనా పంటలు వేయాలనుకున్న రైతులు కాడిని భుజాన వేసు కొని కాడెద్దులుగా మారి చారలు(లైన్లు) పట్టిన దయనీయ పరిస్థితి కుమురంభీం- ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం అమర్గొండ గ్రామంలో జరిగింది. విత్తనాలు పెట్టి పంటలు తీయకపోతే తాము ఎలా బతికేదని, అందుకే భుజాన అరక వేసుకొని చారలు పట్టాల్సి వచ్చిందని రైతులు లాస్కరి కిష్టయ్య, తుమ్మిడె గణపతి తెలిపారు.