Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్)లో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం ఆదివారం నిర్వహించిన పరీక్షకు 40,756 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ మేరకు ఆయా సంస్థల కార్యదర్శి రోనాల్డ్‌రోస్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిదో తరగతిలో మిగిలిపోయిన సీట్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 136 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించామని తెలిపారు. దరఖాస్తు చేసినవారిలో 81 శాతం మంది విద్యార్థులు పరీక్ష రాశారని వివరించారు.