Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్, ఖమ్మం, గోదావరిఖనిలో జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) మోడల్ టెస్ట్‌ను ఆదివారం నిర్వహించారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని పెండెకంటి లా కాలేజ్‌లో హైకోర్టు జడ్జి జస్టిస్ జి.అనుపమ చక్రవర్తి మోడల్ ప్రశ్నాపత్రాన్ని విడుదల చేశారు. టెస్టు నిర్వహణకు ముందు జరిగిన సమావేశానికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జి.విద్యాసాగర్ అధ్యక్షత వహించారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లి సత్యనారాయణ మాట్లాడుతూ యూనియన్ స్వతంత్ర న్యాయవ్యవస్థ, చట్టబద్ధ పాలన, సామాన్యులకు న్యాయం కోసం పని చేస్తున్నదని వివరించారు. ఈ సందర్భంగా జస్టిస్ అనుపమ జేసీజే అభ్యర్థులకు చిట్కాలు సూచించారు. ప్రిలిమ్స్, మెయిన్స్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సమావేశంలో యూనియన్ ఉపాధ్యక్షులు కె.పార్థసారథి, జాతీయ కౌన్సిల్ సభ్యులు కె.చంద్రశేఖర్ ఆజాద్, హైదరాబాద్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు డి.ప్రవీణ్, సి.రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.