Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోయం బాపురావు అరెస్టును ఖండిస్తున్నాం : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థులను కించపరిచేలా మంత్రులు వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ తప్పుబట్టారు. నిర్మల్ జిల్లాలో బీజేపీ కార్యకర్తల కాళ్లపైకి పోలీసులు కారు తోలుకెళ్లడం దుర్మార్గమనీ, ఎంపీ సోయం బాపూరావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.త్రిపుల్ ఐటీ విద్యార్థులు సంయమనంతో వ్యవహరిస్తున్నా రన్నారు.రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్రలో ఉన్నదని విమర్శించా రు.విద్యార్థులను పరామర్శించకుండా స్థానిక ఎంపీని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు పోరూ..ఇంకొకరిని పోనివ్వట్లేదని విమర్శించారు. నిర్మల్ జిల్లాలో కొందరు అధికారులు ప్రభుత్వానికి కొమ్ముకాసే పనిలో ఉన్నారని ఆరోపించారు. బాసర విద్యార్థుల సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.