Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రతి ఆదివారం 10 నిమిషాలు తమ ఇంటి పరిసరాలలను శుభ్రం చేసుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రుల నివాస సముదాయంలోని తన అధికారిక నివాసంలో పరిసరాలు పరిశుభ్రం చేశారు. ఇంటి ఆవరణలో నిల్వ ఉన్న నీటి ద్వారా డెంగ్యూ, ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలే ఆస్కారం ఉన్నందున ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఇంటి పరిసరాలు పరిశుభ్రం చేసుకోవాలని మంత్రి కోరారు. కేటీఆర్ పిలుపు మేరకు హైదరాబాద్ నగర ప్రజలకు అవగాహన కల్పిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి తన ఇంటి పరిసరాలను స్వయంగా పరిశుభ్రం చేశారు. అవరణలో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. మంత్రి తో పాటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, నిజమాబాద్ డీసీసీబీ చైర్మెన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.