Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్‌రావుకు కాంట్రాక్టు లెక్చరర్ల ఫోరం వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వులు త్వరగా వచ్చేలా చూడాలని కాంట్రాక్టు అధ్యాపకుల ఫోరం డిమాండ్ చేసింది. ఈ మేరకు మంత్రి టి హరీశ్‌రావును ఆదివారం హైదరాబాద్‌లో ఫోరం కన్వీనర్ సయ్యద్ జబీ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణను చేపట్టాలంటూ సీఎం కేసీఆర్ ఆదేశించి నాలుగు నెలలు గడుస్తున్నా ఇంకా జాబితా ప్రభుత్వానికి చేరలేదని తెలిపారు. దీంతో వారు మానసిక ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. అర్హులైన వారి జాబితాలు త్వరగా ప్రభుత్వానికి పంపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎవరూ అధైర్యపడొద్దనీ, ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం కోకన్వీనర్లు రాజగౌడ్, వసంత్, స్వామిగౌడ్ తదితరులున్నారు.