Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభినందించిన హర్యానా గవర్నర్ దత్తాత్రేయ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చండీగఢ్‌లోని హర్యానా రాజ్‌భవన్‌లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం(హైదరాబాద్) నాట్యవిభాగం అధిపతి డాక్టర్ వనజ ఉదరు నేతృత్వంలోని బృందం కూచిపూడి, ఆంధ్రనాట్యాలు, కళాకృష్ణ నృత్య దర్శకత్వం వహించిన పేరిణీ శివతాండవం శాస్త్రీయ నృత్యాన్ని ఆదివారం ప్రదర్శించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ వాటిని వీక్షించారు. వారి నాట్య ప్రావీణ్యాన్ని ప్రశంసించారు. బృంద సభ్యులను సత్కరించి అభినందించారు. అనంతరం విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణ, మార్గదర్శకత్వం అందించినందుకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సల ర్ ప్రొఫెసర్ తంగడ కిషన్ రావుని ఫోన్‌ద్వారా దత్తాత్రేయ అభినందించారు.