Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
'ఆజాదీ కా అమత్ మహౌత్సవ్' ఉత్సవాలలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్)లోని రక్షక దళం హైదరాబాద్ నుండి న్యూఢిల్లీకి 'మోటార్ సైకిల్ ర్యాలీ'ని చేపట్టింది. ఈ ర్యాలీని ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ (ఇంచార్జి) అరుణ్ కుమార్జైన్ సోమవారం నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఇనస్పెక్టర్ జనరల్, ఎస్సీఆర్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ రాజారామ్, సికింద్రాబాద్ డివిజన్ డీఆర్ఎమ్ ఏకే గుప్తా, హైదరాబాద్ డివిజన్ డీఆర్ఎమ్ శరత్ చంద్రాయన్ పాల్గొన్నారు. భారతీయ రైల్వేలోని అయిదు జోన్లకు సంబంధించిన ఆర్పీఎఫ్ రైడర్లు ఈ యాత్రను చేపట్టారు. 40 మంది రైడర్లు 20 బుల్లెట్ మోటార్ సైకిళ్లపై న్యూఢిల్లీకి బయలుదేరారు. వీరిలో ఇద్దరు మహిళా రైడర్లు కూడా ఉన్నారు. 1,700 కిలోమీటర్ల దూరం సాగే ఈ యాత్ర తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ఢిల్లీకి చేరుకుంటుంది. ఈ యాత్రలో రైడర్లు స్వాతంత్య్ర సమరం, 75 ఏండ్ల అమతోత్సవ సందేశాన్ని ప్రజలకు వివరిస్తూ వెళ్తారు.