Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రద్దయిన మెడికల్ కాలేజీల విద్యార్థుల హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తమను రీలొకేషన్ చేయకపోతే మున్ముందు పోరాడుతామని రద్దయిన మూడు మెడికల్ కాలేజీల విద్యార్థులు హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నేషనల్ మెడికల్ కమిషన్ మూడు కళాశాలలను రద్దు చేసి విద్యార్థులను రీలొకేషన్ చేయాలని ఈ ఏడాది మే 17న, జూన్ 16న రెండు సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి మార్గదర్శకాలు ఇచ్చిందని తెలిపారు. బీహార్ ప్రభుత్వం రీలొకేషన్ చేసిన మార్గదర్శకాలను జత చేస్తూ జులై ఐదున రాష్ట్ర ప్రభుత్వ సందేహాలకు సూచనలు కూడా చేసిందని తెలిపారు. దీనిపై సర్కారు స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించగా జులై 11న కోర్టు నాలుగు వారాల్లో విద్యార్థులను ఇతర కళాశాలలకు రీలొకేషన్ చేయాలని ఆదేశించిందన్నారు. మూడు వారాలు ముగిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. త్వరగా ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిసి పోరాటం ప్రారంభిస్తామని హెచ్చరించారు.