Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్శిటీ వివిధ ఫ్యాకల్టీల్లో పీహెచ్డీ ప్రోగ్రామ్లలో ప్రవేశానికి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పీహెచ్డీ అడ్మిషన్ కేటగిరీ -1, అండ్ 2 రెండింటికీ నిర్వహిస్తారు. కేటగిరీ 1 కోసం, దరఖాస్తుదారు జాతీయ ఫెలోషిప్ హోల్డర్ అయి ఉండాలి. సంబంధిత ఫ్యాకల్టీల డీన్లు జారీ చేసిన అడ్మిషన్ నోటిఫికేషన్ల కోసం సంప్రదించవచ్చు. దరఖాస్తు ఫారమ్తోపాటు నిర్ణీత అటాచ్మెంట్లను ఆగస్టు 6వ తేదీ సాయంత్రం 5.00 గంటలలోపు సంబంధిత డీన్ కార్యాలయానికి సమర్పించాలి. మరింత సమాచారం కోసం అభ్యర్థులు సంబంధిత డీన్స్ కార్యాలయాల్లో సంప్రదించవచ్చు. కేటగిరీ 2 కోసం, పీహెచ్డీ ప్రవేశ పరీక్ష క్లియరెన్స్ ద్వారా, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా అడ్మిషన్లు ఉంటాయి. పీహెచ్డీ ప్రవేశ పరీక్ష - 2022 నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఆన్లైన్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ఆగస్టు 18న ప్రారంభమై సెప్టెంబర్ 17 వరకు కొనసాగుతుంది. దరఖాస్తు చేయడంలో ఆలస్యమైనవారు లేట్ ఫీజు చెల్లించి సెప్టెంబర్ 24 వరకు దరఖాస్తు చేయవచ్చు. మరిన్ని వివరాలకు www.osmania.ac.in aode www.ouadmissions.comను చూడవచ్చు.
14 విభాగాల్లో ఖాళీలు నిల్..
విడుదల చేసిన పీహెచ్డీ నోటిఫికేషన్లో సుమారు 14 విభాగాల్లో ఎలాంటి ఖాళీలు లేకపోవడం శోచనీయం. మరియు 9 విభాగాల్లో 30 ఖాళీలు ఉన్నాయి. పీహెచ్డీ నోటీపీకేషన్ జారీతో ఓయూ పరిపాలనా భవన్ ఎదుట భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.