Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
నవతెలంగాణ-ఓయూ
ఇంజినీరింగ్, ఫార్మసీ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి టీఎస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్-2022) ప్రవేశ పరీక్షలు నేటి నుంచి 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కన్వీనర్, ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ, కో కన్వీనర్ ప్రొఫెసర్ పి.రాజశేఖర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 19 సబ్జెక్టుల్లో ఉదయం 10 నుంచి 12, మధ్యాహ్నం 2నుంచి4 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయని, హైదరా బాద్లో 5,వరంగల్లో 7 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించబోమని పేర్కొన్నారు. విద్యార్థులు హాల్టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని, వాటిలో సూచించిన నిబంధనలు పాటించాలని సూచించారు. 15 వేల మంది విద్యార్థులు పీజీఈఎసెట్కు దరఖాస్తులు చేసుకున్నట్టు సమాచారం.