Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్ తలపెట్టిన మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో మంగళవారం ప్రారంభం కానున్నది. ఉదయం 10 గంటలకు యాదాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు వంగమర్తిలో సభ నిర్వహించనున్నారు. ప్రారంభ సభకు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ముఖ్యఅతిథిగా రానున్నారు. ఈ యాత్ర 12 నియోజకవర్గాల మీద సాగనున్నది. ఈ నెల 26వ తేదీన హన్మకొండ భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర ముగియనుంది. 24 రోజుల పాటు 125 గ్రామాల మీదుగా 325 కిలోమీటర్ల మేర బండి సంజరు పాదయాత్ర కొనసాగనున్నది. ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, జనగామ, పాలకూర్తి, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, పరకాల, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రకు ప్రముఖ్‌గా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొంగిడి మనోహర్‌రెడ్డి వ్యవహరించనున్నారు.