Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీటెక్, బీఈ, బీ ఫార్మసీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో లాటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాల కోసం నిర్వహించిన ఈసెట్ రాతపరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఈసెట్ కన్వీనర్ కె విజయకుమార్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 24,055 మంది దరఖాస్తు చేశారనీ, వారిలో 22,001 (91.46 శాతం) మంది అభ్యర్థులు పరీక్ష రాశారని వివరించారు. 2,054 (8.54 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ పరీక్ష ను ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహ్మారెడ్డి, ఈసెట్ కోకన్వీనర్ ఈరామ్జీ, కోఆర్డినేటర కె భాస్క ర్ పర్యవేక్షించారని తెలిపారు. మంగళవారం ఈసెట్ రాతపరీక్షల ప్రాథ మిక కీని విడుదల చేస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు వారి రెస్పాన్స్ షీట్‌ను https://ecet.tsche.ac.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఈనెల నాలుగో తేదీ సాయంత్రం నాలు గు గంటల వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను పంపించాలని కోరారు.