Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ఆవేదన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహిళలపై నేరాలు పెరుగుతుండటం పట్ల రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్‌భవన్ ఇటీవల మహిళా దర్బార్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 10న నిర్వహించిన దర్భార్ లో 193 పిటీషన్లు వచ్చాయి. వీటిలో ఎక్కువ ఆర్థిక, ఆరోగ్య, సామాజిక, కుటుంబ వివాదాలు, సేవలు, భూమి, ఆస్తులకు సంబంధించినవి ఉంటున్నాయి. వారి పిటీషన్లను విభజించి పోలీస్, రెవెన్యూ, మహిళా, శిశు, వికలాంగులు, గిరిజన, ఎస్సీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు, రాష్ట్ర వైద్యారోగ్యశాఖలకు ఇది వరకే పిటీషన్లను పంపించారు. అవసరమైన వారికి వైద్య, న్యాయ సహాయాన్ని అందజేశారు. కొందరికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ నెల 18న 42 పిటీషన్లు రాగా వాటిలో ఇద్దరి నుంచి ముగ్గురు వరకు తమ భర్తలను తమను వదిలేసి విదేశాల్లో నివసిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వీటిపై చర్య తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖాశర్మను గవర్నర్ కోరిన సంగతి తెలిసిందే. మహిళా దర్బార్‌ను వ్యతిరేక భావనతో చూడవద్దనీ, కేవలం మహిళల సమస్యలను పరిష్కరించడంలో సంబంధిత శాఖలకు అనుసంధానిస్తున్నదని రాజ్‌భవన్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నది.