Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్‌లోని రాజ్ భవన్ హైస్కూల్ పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ జాతీయ జెండా, నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. సోమవారం పాఠశాలలో జరిగిన 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో భాగంగా ఆమె 75 జాతీయ జెండాలను విద్యార్థులకు అందజేశారు. స్వాతం త్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మనది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమని తెలిపారు. వజ్రోత్సవాల సందర్బంగా 75 మెడికల్ క్యాంపులను, 75 రక్తదాన శిబిరాలను నిర్వహించాలని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ బాధ్యులకు సూచించారు. ఆన్లైన్ కాంపిటేషన్ లో పాల్గొన్న 75 మంది విద్యార్థులకు ఆమె బహుమతులను అందజేశారు.