Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో 22 నెలలపాటు క్షోభ పెట్టి వీఆర్వోలను లాటరీ ద్వారా ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేస్తూ జీవో జారీ చేయడం దుర్మార్గమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెవెన్యూ వ్యవస్థపై సీఎం కేసీఆర్ కక్షగట్టి మరీ పగ తీర్చుకుంటున్నారని ఆరోపించారు. అశాస్త్రీయమైన ధరణి వెబ్సైట్లోని తప్పులను ఎత్తిచూపుతారనే ఉద్దేశంతో వీఆర్వో వ్యవస్థను తొలగించారని విమర్శించారు. కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటు చేసిన కేసీఆర్ రెవెన్యూ శాఖలో ఒక్క వీఆర్వో పోస్ట్ కూడా క్రియేట్ చేయలేదని పేర్కొన్నారు. భూస్వామ్య మనస్తత్యవం కలిగిన కేసీఆర్కు ప్రజాస్వామ్యంపైన నమ్మకం లేదని విమర్శించారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల అధికారాల్లో కోతపెట్టి వారిని నామమాత్రంగా మార్చారని తెలిపారు. చివరకు గ్రామ కార్యదర్శులకు కూడా మనశ్సాంతి లేకుండా చేస్తున్నారని విమర్శించారు.