Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశాలత
నవతెలంగాణ- ఆదిలాబాద్అర్బన్
ప్రజలు ఆదాయ మార్గాలు కోల్పోతుంటే.. ప్రభుత్వాలు ఇస్టానుసారంగా ధరలు పెంచుతున్నాయని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశాలత అన్నారు. ధరల పెరుగుదల కారణంగా ప్రజలు మూడు పూటలా తినలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా కేంద్ర కమిటీ పిలుపు మేరకు సంతకాల సేకరణ చేపట్టారు. ధరల పెరుగుదలకు గల కారణాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఐద్వా ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చేపట్టిన సంతకాల సేకరణలో ఆశాలత పాల్గొన్నారు. మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్, బస్టాండ్, రణదివెనగర్ కాలనీలో సంతకాలు సేకరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరుద్యోగం పెరుగు తోందని, ప్రజలు ఆదాయ మార్గాలు కోల్పోతుంటే ప్రభుత్వాలు మాత్రం నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ సామాన్యులపై భారాలు మోపు తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడంతో పాటు జీఎస్టీ పేరుతో పాల ఉత్పత్తుల నుంచి పెన్సిల్ వరకు పన్నులు విధించడం దుర్మార్గమని చెప్పారు. ఆహార భద్రత పథకాన్ని సార్వత్రికం చేయాలని, బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు.14రకాల నిత్యావసర సరుకులను అందజే యాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ చేసి వాటిని రాష్ట్రపతికి అందజేస్తా మని తెలిపారు.కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శకుంతల, మయూరిఖాన్, సహాయ కార్యదర్శి లలిత, విద్య, మంజుల పాల్గొన్నారు.