Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఆగస్టు 8 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్ర సాంస్కృతిక, క్రీడా, పర్యాటకశాఖల ఆధ్వర్యంలో నిర్వహించే సన్నాహక కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని ఆ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. సోమవారంనాడాయన హైదరాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఆ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో క్రీడాపోటీలు నిర్వహించాలని చెప్పారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో 15 రోజుల పాటు దేశభక్తి, జాతీయ సమైక్యతను ప్రతిబింబించేలా నాటక, నత్య, సంగీత, కళా కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, ముషాయిరా నిర్వహించాలని ఆదేశించారు. తెలంగాణ టూరిజంకు చెందిన పర్యాటక కేంద్రాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించాలని చెప్పారు. సమావేశంలో యువజన సర్వీసుల శాఖ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ, క్రీడా శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుజాత, క్రీడా పాఠశాల ఓఎస్డీ డాక్టర్ హరికష్ణ తదితరులు పాల్గొన్నారు.