Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పించుకోవడానికే చైన్ స్నాచింగ్.. ప్రచారం : డీసీపీ సీతారాం
నవ తెలంగాణ-జనగామ
ఏడాది కూడా నిండని కన్నబిడ్డనే తల్లి చంపిన ఘటన జనగామ కేంద్రంలోని అంబేద్కర్‌నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. అంబేద్కర్ నగర్‌కు చెందిన మహిళపై చైన్ స్నాచింగ్‌కు యత్నించగా పెనుగులాటలో తనచేతిలోని పాప సంపులో పడి చనిపోయిందని తల్లి తప్పుడు ప్రచారం చేసింది. ఈ క్రమంలో డీసీపీ ఆధ్వర్యంలో ఏసీబీ కృష్ణ, సీఐ శ్రీనివాసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జనగామ డీసీపీ సీతారాం వివరాలు వెల్లడించారు తల్లి ప్రసన్న తన 12 నెలల కూతురు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో పెంచడం వల్ల భవిష్యత్తులో కూడా ఫలితం లేదని సమీపంలోని సంపులో పడేసిందని దర్యాప్తులో తెలినట్టు తెలిపారు. సొంత కూతురును చంపుతుంటే చుట్టుపక్కల వాళ్ళు అసహ్యించుకుంటారని భావించి దొంగలు తన మెడలోని చైన్ లాక్కెళ్తుండగా జరిగిన పెనుగులాటలో పాప సంపులో పడిందని ప్రచారం చేసిందన్నారు. పసికందు ఆనారోగ్య సమస్యలే హత్యకు కారణం అని తెలిపారు. చైన్ స్నాచింగ్‌కు వచ్చిన దొంగలు ఇప్పటివరకు పిల్లలను చంపిన దాఖలాలు లేవని, ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తుండగా తల్లిని విచారించామని, దాంతో హత్యానేరం ఒప్పుకున్నట్టు డీసీపీ తెలిపారు. పాప తండ్రి భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ తెలిపారు.