Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కూతురు మృతి
- మరో ఇద్దరికి స్వల్ప గాయాలు
నవతెలంగాణ-శంషాబాద్
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ కూతురు తాన్య(22) మృతి చెందగా, మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ప్రకారం.. బంజారాహిల్స్‌కు చెందిన తాన్య (22), డ్రైవర్ మీర్జా అలీ, మరో యువతి దియా ఐ-20 కారులో బంజారాహిల్స్ నుంచి గచ్చిబౌలి మీదుగా శంషాబాద్ చేరుకున్నారు. నేషనల్ హైవే- 44పై తిరుగు ప్రయాణమై నగరానికి వెళ్తున్న సమయంలో మధ్య రాత్రి 12 :05 గంటలకు సాతంరాయిలోని ఎంఎస్ కన్వెన్షన్ వద్ద కారు అతివేగంగా వచ్చి అదుపుతప్పి డివైడర్‌ను ఢకొీట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న తాన్య, కారు రూఫ్ టాప్ తెరిచి ఉండటంతో ఆమె ఎగిరి కింద పడింది. ఆమె తల, నుదిటిపై, కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగ్రాతులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు అక్కడ పరీక్షించిన వైద్యులు తాన్య మృతి చెందినట్టుగా ధృవీకరించారు. కారు డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపడంతో కారు ప్రమాదానికి గురైందని పోలీసులు నిర్ధారించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. మృతురాలు తాన్య హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ కూతురుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఫిరోజ్‌ఖాన్‌ను ఫోన్లో పరామర్శించిన బండారు దత్తాత్రేయ
కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్‌ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సోమవారం ఫోన్‌ద్వారా పరామర్శించారు. ఫిరోజ్‌ఖాన్ కుమార్తె తానియా రోడ్డుప్రమాదంలో మరణించిన విషయం విదితమే. తానియా మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఫిరోజ్ ఖాన్‌ను ఓదార్చారు.