Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టల్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్
- హైదరాబాద్ డాక్సదన్తోపాటు పలు పోస్టాఫీసుల ఎదుట నిరసన
నవతెలంగాణ-కంటోన్మెంట్
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరిం చాలన్న తన విధానాన్ని మార్చుకోవాలని పోస్టల్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. పోస్టల్ సేవలను ప్రయివేటీకరించొద్దని డిమాండ్ చేశారు. ఆగస్టు 10న పోస్టల్ ఉద్యోగుల ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మె సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని నిజాం కళాశాల నుంచి డాక్ సదన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇక్కడ ధర్నా చేశారు. ఎక్కడికక్కడ పోస్టల్ ఉద్యోగులు ఆయా ప్రధాన పోస్టల్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేశారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్, ఫేడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్, ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ - జిడిఎస్, పోస్టల్ యూనియన్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవక్ తదితర సంఘాలు జేఏసీగా ఏర్పడి ఆగస్టు 10న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్టు నాయకులు తెలిపారు. అందరూ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పోస్టల్ ఉద్యోగుల జేఏసీ తరఫున తెలంగాణా సర్కిల్ యూనియన్ నాయకులు ఎ.శ్రావణ్ కుమార్, రామ్‌కుమార్, మధుసూదన్, సిరాజుద్దీన్, ఎం.దాస్,రెడ్డి, రిటైర్డ్ పోస్టల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.