Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గజ్వేల్
చంటి పిల్లలకు తల్లిపాలు శ్రీరామరక్ష అని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో సోమవారం జాతీయ తల్లిపాల వారోత్సవాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోని అతిపెద్దదైన బుక్ ఆఫ్ ఇండియాలో సీఎం కేసీఆర్ నియోజకవర్గ కేంద్రం గజ్వేల్ తల్లులతో చరిత్ర సృష్టించిందన్నారు. మున్సిపాలిటీ, రోటరీ క్లబ్, లైన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి పుట్టిన బిడ్డకు డబ్బా పాలు వద్దని తల్లిపాలు, మాత్రమే ఇవ్వాలని అవగాహన కల్పించాలని సూచించారు. దేశంలో 41 శాతం మంది తల్లులే తల్లిపాలు ఇస్తున్నారని, మిగతా 60 శాతం మంది డబ్బా పాలు అందజేయడంతో తల్లికీ పిల్లలకు నష్టమని సూచించారు. బంగ్లా దేశంలోనే 91 శాతం తల్లులు పిల్లలకు పాలిస్తున్నట్టు చెప్పారు. దీనిపై అవగాహన కల్పించాలని ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు సూచించారు.
ఇండ్లల్లో ప్రసూతి కేసులు తక్కువై ఆస్పత్రిలోనే నార్మల్‌గా డెలివరీ అవుతున్నారన్నారు. ఒకటో నెల నుంచి ఏడు నెలల వరకు తల్లిపాలు పట్టాలని తల్లులకు సూచించారు. కార్యక్రమంలో మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, ఫారక్ హుస్సేన్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రోజా శర్మ, ఎఫ్డీసీ చైర్మెన్ వంటేరు ప్రతాపరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ మాదాసు శ్రీనివాస్. మున్సిపల్ చైర్మెన్ నేతి చిన్న రాజమౌళి, వైస్ చైర్మెన్ జకీర్, గడ స్పెషల్ అధికారి ముత్యం రెడ్డి, జిల్లా వైద్యాధికారి కాశీనాథ్, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, గజ్వేల్ మున్సిపల్ కమిషనర్ విద్యాధర్, గజ్వేల్ జెడ్పీటీసీ పంగ మల్లేశం, వార్డు కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.