Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్వెస్లీ
- తెలంగాణ రైతాంగ సాయుధపోరాట యోధుడు కృష్ణమూర్తి 16వ వర్ధంతి
నవతెలంగాణ- మంచాల
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుడు కృష్ణమూర్తి ఆశయ సాధనకు మనమందరమూ కృషి చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్వెస్లీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలోని కాచం కృష్ణభవన్లో సోమవారం కృష్ణమూర్తి 16వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కృష్ణమూర్తి కీలక పాత్ర పోషించారని చెప్పారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటంలో కృష్ణమూర్తి పాత్ర మరువలేనిదన్నారు. రజాకార్లతో వీరోచిత పోరాటం చేశారని కొనియాడారు. గ్రామాల్లో రాత్రి పూట తిరుగుతూ, పగలు అడవుల్లో సమావేశాలు నిర్వహించేవారని గుర్తు చేశారు. రాచకొండ సరిహద్దు జిల్లాలైన నల్లగొండ, రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం నియోజవకవర్గాల్లో అనేక ఉద్యమా లు నడిపి,వేల ఎకరాల భూములను పేదలకు పంచారని తెలిపారు.సీపీఐ(ఎం) కార్యకర్తలు, నాయకులు కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకుని, ఆయన ఆశయ సాధనకు నిరంతరం కృషి చేయాల న్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పగడాల యాదయ్య, మండల కార్యదర్శి నాగిల్ల శ్యామ్సుందర్,నాయకులు రావుల జంగయ్య, కందు కూరి జగన్, సిలివేరు రాజు, పగడాల వెంకటేష్, పుల్లగళ్ళ గోపాల్, ఆవుల యాయ్య, కాళ్ళ జంగయ్య, తోడే సువర్ణ, రంగాపూర్ సర్పంచ్ డబ్బికా ర్ మమత అజరుబాస్, ఆర్.స్వామి పాల్గొన్నారు.