Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు వీలుగా రూ.10 లక్షలను కేటాయించినందుకు సీఎం కేసీఆర్ కు, బీసీ సంక్షేమశాఖ మంత్రికి రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. బహుజన వీరుడు పాపన్న గౌడ్ జయంతిని ఈ నెల ఎనిమిదిన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. గౌడ సంఘాల ప్రతినిధులు అందులో భాగస్వాములు కావాలని పిలుపుని చ్చారు. కామన్వెల్త్ గేమ్స్ పరిశీలన కోసం బర్మింగ్ హామ్‌కు వెళ్లిన మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు అక్కడ ఘన స్వాగతం లభించింది.