Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజగోపాల్‌రెడ్డిపై కాంగ్రెస్ ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీ చేతిలో పావుగా మారాడని టీపీసీసీ నేతలు విమర్శించారు. సొంత పార్టీకే ఆయన వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. రూ. 600 కోట్ల సామర్థ్యం ఉన్న రాజగోపాల్‌రెడ్డి కంపెనీకి రూ. 22వేల కోట్ల కాంట్రాక్టు ఎట్లా వస్తున్నదని ప్రశ్నించారు.ఎనిమిదేండ్లలో బీజేపీ సర్కారు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందనీ, అయినా బీజేపీ నేతలు చొరవ తీసుకుని ఆయనకు కాంట్రాక్టు ఇప్పించారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సిద్ధాంతమేంటి? అయినా ఆయన బీజేపీకి బానిసయ్యారని విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలు అంజన్‌కుమార్, జి.చిన్నారెడ్డి, మల్లురవి, బెల్లయ్యనాయక్, అద్దంకి దయాకర్ వేర్వేరుగా విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉందనీ, ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదని చెప్పారు. వారిద్దరినీ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఎంతో ప్రోత్సహించిందని గుర్తు చేశారు. తమ వ్యాపారాలను రక్షించుకునేందుకే రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి పోతున్నారని విమర్శించారు. ఈనెల 5న మునుగోడులో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. మునుగోడులో కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్యపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. ఆనియోజకవర్గంలో ప్రత్యర్థి ఎవరైనా గెలుపు తమ పార్టీదేనన్నారు. కాంగ్రెస్ నచ్చకుంటే, ఎప్పుడో పార్టీ నుంచి వెళ్లాల్సిందని గుర్తు చేశారు. అంతే తప్ప పార్టీపై తప్పుడు ఆరోపణలు చేయడం సరైంది కాదని చెప్పారు. బీజేపీలో చేరేందుకే మోడీ, అమిత్‌షాను ఆయన పొగడ్తల్లో ముంచెత్తుతున్నారని వారు విమర్శించారు.
దిష్టిబొమ్మ దహనం
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనంగా ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. టీపీసీసీ ఫిషర్మెన్ చైర్మెన్ మెట్టుసాయికుమార్ ఆధ్వర్యంలో బుధవారం గాంధీభవన్ వద్ద దిష్టిబొమ్మ కార్యక్రమాన్ని నిర్వహించారు.