Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర జరిగిన నేపథ్యంలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పరామర్శించారు. ఈమేరకు బుధవారం బంజారాహిల్స్‌లోని జీవన్‌రెడ్డి నివాసానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండే జీవన్‌రెడ్డిపై హత్య కుట్రకు పూనుకోవడం హేయమైన చర్య అన్నారు. ధైర్యంగా ఉండాలంటూ ఆయన భరోసా ఇచ్చారు.