Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యంత ఖరీదైన విలాసాలకు డబ్బులెక్కడి నుంచి వచ్చారు
- క్యాసినోలో పాల్గొన్న ఫంటర్స్‌కు
- ఇచ్చిన కాయిన్స్ విదేశాలకు ఎలా వెళ్లాయి..:
- ప్రవీణ్, మాధవరెడ్డి, సంపత్‌ను నిలదీసిన ఈడీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
కోట్ల రూపాయల క్యాసినోలు నిర్వహించిన చీకోటి ప్రవీణ్ బృందాన్ని గురువారం మూడో రోజూ దాదాపు పదిన్నర గంటలకుపైగా ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు విచారించారు. అత్యంత ఖరీదైన విలాసవంతమైన జీవితాలను ఎలా గడిపారు.. దానికైనా కోట్లాది రూపాయల ఖర్చు ఎక్కడి నుంచి తెచ్చారు.. ఆ డబ్బులను పొందడానికి వారు అనుసరించిన మార్గాలేంటి తదితర కోణాల్లో ప్రవీణ్, మాధవరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారని తెలిసింది. ముఖ్యంగా నేపాల్, ఇండోనేషియా, థారులాండ్, శ్రీలంకలో నిర్వహించిన క్యాసినోలకు పంపించిన ఫంటర్స్‌కు లక్షల రూపాయల కాయిన్లను ఏ విధంగా అందజేశారు.. వాటిని దేశం నుంచి విదేశాలకు ఏ మార్గంలో తరలించారు అనే ప్రశ్నలకు ప్రవీణ్, మాధవరెడ్డి, సంపత్ తడబడ్డారని తెలిసింది. ప్రవీణ్, మాధవరెడ్డి అనుభవించిన విలాసవంతమైన జీవితాల గురించి సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని వీడియోలు, సమాచారాన్ని ఆధారం చేసుకుని కూడా ఈడీ ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ క్యాసినోలలో పాల్గొన్న బాలీవుడ్, టాలీవుడ్ సెలబిట్రీలకు ఇచ్చిన లక్షల రూపాయల పారితోషికాన్ని ఏవిధంగా అందజేశారనే సమాచారాన్ని కూడా ఈడీ అధికారులు వీరి నుంచి రాబట్టేందుకు ప్రయత్నించారని తెలిసింది. కొంతమేరకు సమాచారాన్ని ప్రవీణ్ నుంచి బయటపెట్టించారని సమాచారం. మూడో రోజు సాగిన సుదీర్ఘ విచారణలో ప్రవీణ్‌కు చెందిన మరో సన్నిహితుడు నాగిరెడ్డిని కూడా ఈడీ ప్రశ్నించింది.